అసంతృప్తి జ్వాల రాజుకుంది.
జ్ఞానేశ్వర్ మేడపై వేలాడుతున్న కత్తి.
డామేజ్ కంట్రోల్‌కు సీఈసీ కుస్తీ.
ఓటు వేయబోయే ముందు ఓటరే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? దేశ ఎన్నికల వ్యవస్థను నడిపించే ఎన్నికల సంఘం చుట్టూ ఇప్పుడు అసాధారణ పరిణామాలు కలకలం రేపుతున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పద్నాలుగు సార్లు లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదిక రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఓటర్ల జాబితా సవరణ నుంచి ఫారం-6 మార్పుల వరకు, డేటాబేస్ కేంద్రీకరణ నుంచి సాఫ్ట్‌వేర్ వినియోగం వరకు ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. మరోవైపు ఎన్నికల సంఘం మాత్రం ఇవన్నీ సాధారణ అంతర్గత చర్చలేనని, తుది నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని చెబుతోంది. కానీ ప్రతిపక్షం వెనక్కి తగ్గడం లేదు. సీఈసీ తొలగింపునకు పార్లమెంటరీ చర్యకు సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, పలు రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపులు వినిపిస్తున్నాయి. అసలు విభేదం ఎక్కడ మొదలైంది? సర్‌లో ఏం జరిగింది? ఎన్ని ఓటర్ల పేర్లు ప్రభావితమయ్యాయి? ఎన్నికల సంఘం చెబుతున్నదేంటి? కమిషనర్ల అభ్యంతరాల వెనుక ఉన్న పత్రాలు ఏమంటున్నాయి? దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఓటు హక్కు చుట్టూ ముసురుకున్న ఈ ప్రశ్నల పూర్తి కథనం ఇది.
#ECI #ElectionCommission #GyaneshKumar #SukhbirSinghSandhu #VivekJoshi #ECIRift #SIR #SIRControversy #VoterList #Form6 #ElectoralRoll #ECINet #VoterRights #CEC #ElectionNews











