ప్రలోభాలతో ఆపొజిషన్‌కు ఫిట్టింగ్.
పందెం “కాసే” వాడిదే పైచేయి.
ఎన్నికల గంట మోగుతోంది.. స్థానిక సమరానికి రాజకీయ పార్టీలు కదులుతున్నాయి. టికెట్ల లెక్కలు మొదలయ్యాయి.. బలాబలాల అంచనాలు సాగుతున్నాయి.. ఖర్చుల పద్దులు సిద్ధమవుతున్నాయి. కానీ ఈ రాజకీయ లెక్కల వెనుక మరో చీకటి లెక్క దాగి ఉందా? క్రికెట్ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు తిప్పుతున్న నెట్‌వర్క్‌లు.. ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్ల విలువైన సరుకును కదిలిస్తున్న ముఠాలు.. గంజాయి రవాణాలో రూట్లు, వాహనాలు, మధ్యవర్తులతో పనిచేస్తున్న గ్యాంగ్‌లు.. ఇప్పుడు ఎన్నికల మైదానాన్ని చూస్తున్నాయా? పోలీసులు వరుసగా బయటపెడుతున్న కేసులు అక్రమ ఆర్థిక వ్యవస్థల విస్తృతిని చూపిస్తున్నాయి. కానీ ఆ డబ్బు రాజకీయాల్లోకి ప్రవేశించిందని చెప్పాలంటే ఆధారాలు కావాలి. అందుకే అసలు కథ ఆరోపణల్లో లేదు.. మనీ ట్రయిల్‌లో ఉంది. ఒక బుకీ ఖాతా నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లింది? స్మగ్లర్ సంపాదన ఎవరిని చేరింది? ఎన్నికల ఖర్చులోకి అక్రమ సొమ్ము ప్రవేశించిందా? ఎవరి వెనుక ఎవరి ఆర్థిక బలం ఉంది? బ్యాట్‌తో మొదలైన డబ్బు ప్రయాణం బ్యాలెట్ దగ్గరకు చేరిందా? ప్రశ్నలు ఎన్నో.. సమాధానాలు మాత్రం రికార్డుల్లో దాగున్నాయి. బీ రెడీ.. స్థానిక ఎన్నికల వెనుక నడుస్తున్న డబ్బు నీడను ఛేదించే అసలు కథ..!
#LocalElections #ElectionMoney #MoneyTrail #PoliticalFunding #ElectionExpenditure #BettingNetwork #CricketBetting #RedSandalwoodSmuggling #GanjaSmuggling #IllegalFunds #ElectionFinance #PoliticalMoney #LocalBodyElections #ElectionNews #MoneyLaundering











