Home AP అమరావతిలో కంటి వైద్యానికి వెలుగు ఎల్వీ ప్రసాద్‌ సంస్థకు భూమిపూజ

అమరావతిలో కంటి వైద్యానికి వెలుగు ఎల్వీ ప్రసాద్‌ సంస్థకు భూమిపూజ

రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి నేత్ర వైద్య కేంద్రానికి అడుగులు పడ్డాయి. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 12 ఎకరాల్లో నిర్మించే సుధా, వెంకట్‌ జాస్తి క్యాంపస్‌ ద్వారా ఏటా సుమారు 3 లక్షల మందికి కంటి వైద్యం అందించనున్నారు. చికిత్సతో పాటు పరిశోధన, శిక్షణ, కమ్యూనిటీ హెల్త్‌ సేవలు అందుతాయి. ప్రత్యేకంగా ఐ అండ్‌ బ్రెయిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. నాలుగు రాష్ట్రాల్లో 319 కేంద్రాల ద్వారా సేవలందిస్తున్న సంస్థ అమరావతి కేంద్రాన్ని ప్రపంచస్థాయి నేత్ర పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు.

క్వాంటం నుంచి పాన్‌-ఐఐటీ వరకు

అమరావతిలో ప్రస్తుతం సుమారు రూ.50 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇన్నర్, ఔటర్‌ రింగ్‌రోడ్లు, స్పోర్ట్స్‌ సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు రానున్నాయని చెప్పారు. ఐటీ తర్వాత క్వాంటం కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టామని, ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో 133 క్యూబిట్‌ కంప్యూటర్‌ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 21 క్వాంటం స్టార్టప్‌లు ముందుకొచ్చాయని తెలిపారు. అక్టోబరు 3న విజయవాడలో పాన్‌-ఐఐటీ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరిశోధన, ఆరోగ్యం, సాంకేతికత, ఆవిష్కరణలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

 

#LVPEI #LVPrasadEyeInstitute #Amaravati #ChandrababuNaidu #EyeCare #EyeHospital #HealthcareHub #EyeAndBrainCentre #Abbarajupalem #QuantumComputing #QuantumValley #DeepTech #PanIIT #AndhraPradesh #AmaravatiDevelopment