Home AP దుర్గమ్మ లడ్డూ ఇకపై ఏటీఎం ద్వారా

దుర్గమ్మ లడ్డూ ఇకపై ఏటీఎం ద్వారా

ఇంద్రకీలాద్రిపై భక్తులకు కొత్త సౌకర్యాలు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యం కోసం సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో తొలిసారిగా దుర్గగుడి కొండ దిగువన అర్జునవీధి వద్ద ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ను దేవాదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ప్రారంభించారు. యూపీఐ ద్వారా చెల్లింపు చేసి క్షణాల్లో లడ్డూ ప్రసాదం పొందేలా యంత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ యంత్రం పనితీరును పరిశీలించి, రద్దీ ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. ఇదే సమయంలో ఫేక్‌ పూజా టికెట్ల వ్యవహారంపై కమిషనర్‌ అప్రమత్తం చేశారు. దళారులను నమ్మి మోసపోవద్దని, టికెట్లు అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు, అధీకృత కౌంటర్ల ద్వారానే పొందాలని సూచించారు. నకిలీ టికెట్లపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే దసరా శరన్నవరాత్రులకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. లక్షలాది భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం, భద్రత, షెడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఉత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

 

#DurgaTemple #LadduATM #KanakaDurgaTemple #Indrakeeladri #Vijayawada #LadduPrasadam #UPIPayments #TempleFacilities #APTemples #Dasara2026 #Sharannavaratri #Devotees #FakeTickets #APEndowments #VijayawadaNews