టార్గెట్ 2029.. నందమూరి మోక్షజ్ఞ.
కొణిదెల అకీరా నందన్ ఎంట్రీ..!
2026 ఎన్నికల్లో మిగతా నేతల ట్రయల్.
మొదలైన ‘నెక్స్ట్ జనరేషన్’ ఆపరేషన్.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వారసత్వ వేట మొదలైందా? తండ్రుల రాజకీయ నీడల నుంచి బయటకు వచ్చి.. కొడుకులు, మనవళ్లు, కొత్త తరం నేతలు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారా? 2029 టార్గెట్‌గా రాజకీయ కుటుంబాలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయా? నారా లోకేశ్ నుంచి నందమూరి మోక్షజ్ఞ వరకు… కొణిదెల అకీరా నందన్ నుంచి ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ రాజకీయ కుటుంబాల వారసుల వరకు… ఒక్కొక్కరి పేరు ఒక్కో చర్చను రేపుతోంది. అయితే వారసత్వం అంటే ఇక కేవలం కుటుంబ పేరు కాదు.. ముందుగా స్థానిక పదవి.. తర్వాత పార్టీ బాధ్యత.. ఆపై అసెంబ్లీ, లోక్‌సభ! ఇదే కొత్త రూట్‌గా కనిపిస్తోంది. అందుకే 2026 స్థానిక ఎన్నికలు ఇప్పుడు మున్సిపల్ పోరు మాత్రమే కాదు.. 2029 రాజకీయ భవిష్యత్తుకు ట్రయల్ రన్! ఎవరు ప్రజల్లో నిలబడతారు? ఎవరు కేడర్‌ను నడిపిస్తారు? ఎవరు కుటుంబ బ్రాండ్‌ను ఓటు బలంగా మార్చగలరు? వారసుడిగా వస్తే సరిపోతుందా? నాయకుడిగా నిలబడగలరా?
#APPolitics #AndhraPradeshPolitics #PoliticalHeirs #PoliticalSuccessors #NextGenerationPolitics #AP2029 #2029Elections #LocalBodyElections #APLocalElections #NandamuriMokshagna #Mokshagna #AkiraNandan #KonidelaAkiraNandan #NaraLokesh #NandamuriFamily #KonidelaFamily #NaraFamily #PoliticalFamilies #PoliticalDynasties #NextGenLeaders #YouthPolitics #TeluguPolitics #APNews











