Home AP ప్రపంచ పెట్టుబడులకు కొత్త చిరునామా విశాఖ!

ప్రపంచ పెట్టుబడులకు కొత్త చిరునామా విశాఖ!

ఆర్థిక భవిష్యత్తుకు వినిపిస్తున్న అభివృద్ధి నగారా
రూ.7 వేల కోట్లతో శ్రీ సిమెంట్స్ పరిశ్రమలు
రూ.18 వేల కోట్లతో కియా విస్తరణకు ప్రణాళికలు
పోర్టులు, రక్షణ, టెక్నాలజీ రంగాలకు ఇన్‌వెస్ట్‌మెంట్స్
యువతకు ఉద్యోగాలు.. మహిళలకు పారిశ్రామిక అవకాశాలు

ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది! సముద్ర తీరాన సాగర కెరటాల సాక్షిగా విశాఖలో మొదలైన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీస్తోంది. చంద్రబాబు ఆలోచనలకు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల పెట్టుబడి ప్రతిపాదనలు తోడవుతున్నాయి. నారా లోకేశ్ దౌత్యం ప్రపంచ కంపెనీలను ఏపీ వైపు ఆకర్షిస్తోంది. కియా విస్తరణకు రూ.18 వేల కోట్లు.. శ్రీ సిమెంట్స్‌కు రూ.7 వేల కోట్ల పెట్టుబడి.. పోర్టులు, డ్రోన్ సిటీ, రక్షణ పరిశ్రమలు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ.. ఇలా ప్రతి రంగంలోనూ అవకాశాల తలుపులు తెరుచుకుంటున్నాయి. వాల్‌మార్ట్ మార్కెట్లలోకి డ్వాక్రా ఉత్పత్తులు, మహిళలకు ప్రత్యేక టెక్ పార్కులు.. యువతకు ఉపాధి బాటలు! అంతర్జాతీయ సంస్థలకు వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారులకు రక్షణ, పరిశ్రమలకు మౌలిక సదుపాయాల భరోసా.. ఇదీ ఏపీ సరికొత్త పారిశ్రామిక వ్యూహం. విశాఖలో వినిపిస్తున్నది కేవలం పెట్టుబడుల ప్రకటనల శబ్దం కాదు.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు వినిపిస్తున్న అభివృద్ధి నగారా! ఈ ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే రాష్ట్ర రూపురేఖలు ఎలా మారతాయి? లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి..!

 

#AndhraPradesh #GlobalInvestments #Visakhapatnam #CIIPartnershipSummit2026 #KiaMotors #ShreeCement #ChandrababuNaidu #NaraLokesh #APIndustrialDevelopment #InvestInAP #JobOpportunities #DefenceIndustry #Semiconductors #GreenEnergy