నషా ముక్త్ భారత్.. యువతే కీలకం!
మోదీ సంకల్పం నెరవేరాలి!
కిషన్ రెడ్డి ఉద్యమానికి కింగ్ నాగ్ ప్రశంసలు!
దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం విజయవంతం కావాలని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన అవగాహన యాత్రను అభినందించారు. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ఈ యాత్రను గమనిస్తున్నానని, ప్రజల నుంచి వస్తున్న స్పందన అభినందనీయమని అన్నారు.
భవిష్యత్ తరాల కోసం అందరూ చేతులు కలపాలి
డ్రగ్స్ నిర్మూలన అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తుతో పాటు రాబోయే తరాల జీవితాలకు సంబంధించిన కీలక బాధ్యత అని నాగార్జున స్పష్టం చేశారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటే ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలి అని కోరారు. యువతలో పెరుగుతున్న చైతన్యం ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ తీసుకున్న సంకల్పానికి ప్రజల సహకారం తోడైతే డ్రగ్స్ రహిత భారత నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
#Nagarjuna #AkkineniNagarjuna #KishanReddy #NashaMuktBharat #DrugFreeIndia #AntiDrugCampaign #DrugAwareness #YouthAgainstDrugs #Hyderabad











