Home General ఆదివారం సెలవు కాదు.. ఏంచక్కా వెళ్లొచ్చు

ఆదివారం సెలవు కాదు.. ఏంచక్కా వెళ్లొచ్చు

సండే తెరుచుకోనున్న బ్యాంకులు.

బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు సెప్టెంబర్‌ 27 ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ వారం అమలు చేయడం సహా పలు డిమాండ్లతో యూఎఫ్‌బీయూ సమ్మెకు సిద్ధమైంది. ఈ సమ్మె బ్యాంకింగ్‌ రంగ అర్ధవార్షిక ముగింపు సమయంలో జరగనుండటంతో ఖాతాదారుల సేవలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. యూఎఫ్‌బీయూ దేశంలోని సుమారు 90 శాతం బ్యాంకింగ్‌ సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది.

ఆర్‌బీఐ అనుమతితో సేవలు కొనసాగింపు

సెప్టెంబర్‌ 27న బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం లింక్‌ శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఖాతాదారుల సౌకర్యమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం తెలిపింది. సమ్మెను వాయిదా వేయాలని ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు యూనియన్లను కోరాయి. అత్యవసర బ్యాంకింగ్‌ సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. సమ్మె తేదీల్లో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు సూచించాయి.

 

#BankHoliday #BanksOpenSunday #September27 #BankStrike #UFBU #PublicSectorBanks #RegionalRuralBanks #RBI #BankingServices #FiveDayBankingWeek #BankCustomers #IndiaBanking #September2026 #BankNews #RBIUpdates