Home General యంగ్ ఇండియా స్కూళ్లు కులవివక్షకు చెక్ పెడతాయ్

యంగ్ ఇండియా స్కూళ్లు కులవివక్షకు చెక్ పెడతాయ్

13


విద్యతో సమాన అవకాశాలు
ఎస్సీల అభివృద్ధికి ప్రాధాన్యం
ఎస్సీ కమిషన్ చైర్మన్‌తో సీఎం భేటీ

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్య, సామాజిక న్యాయం, ఎస్సీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. విద్యార్థుల మధ్య కులవివక్షకు తావులేకుండా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తామని వెల్లడించారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సీఎం తెలిపారు. రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల సంఖ్యను పెంచుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్సీలకు జనాభా శాతానికి మించి అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో వారికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతోందని వెల్లడించారు. ఎస్సీల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కిషోర్ మక్వానాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.