ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త నంది అవార్డు గ్రహీత శ్రీమతి.ఏ.బాల సౌజన్యకుమారి గారి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ జగన్నాథ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అవతారం సందర్భంగా 108 మంది తో పారాయణం అర్ధం తో జరుపబడినది. అత్యంత మహిమోపేతమైన అవతరణ ఎనిమిదవ అవతారం ఈరోజు అష్టమ గర్భంలో పుట్టిన శ్రీ కృష్ణ అవతారం. కృష్ణ తత్వం అనగా సమయాపాలను పాటించడం, ఎక్కువ వినడం తక్కువ మాట్లాడటం కర్మ ను మనం చేసి ఫలితాన్ని కృష్ణుడికి వదిలివేయడమే కృష్ణ తత్వం. 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలి. ఎలా నడుచుకోవాలి ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచింపజేయాలి అనేటువంటి విషయాలను భగవద్గీత రూపంలో కృష్ణుడు మనందరికీ ఇచ్చారు అని సౌజన్య మాట్లాడుతూ తన ఆధ్యాత్మిక వాక్కులను ప్రజలకు పంచారు. దేవాది దేవుడైన కృష్ణుడు తన శక్తితో పూతన తన సకటాచారులను వధిoచి తన పదునైనటువంటి ఆలోచనను అందరికి ఉపయోగ పడేలా చేసేరు. యావత్ ప్రపంచానికి కృష్ణతత్వం ఉండాలి, కృష్ణం వందే జగద్గురు అనేటువంటి ఆధ్యాత్మిక విషయాలను తెలిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ వాడి బుజ్జి సాంస్కృత కార్యక్రమాల కమిటీ అధ్యక్షులు దాడి వాసు సౌజన్య గారిని వారి బృందాన్ని శాలువాతో సత్కరించారు.












