Home General హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లకు అవకాశం ఎప్పుడు? ప్రభుత్వ నియామకాలపై అసోసియేషన్ డిమాండ్

హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లకు అవకాశం ఎప్పుడు? ప్రభుత్వ నియామకాలపై అసోసియేషన్ డిమాండ్

The Telangana Healthcare and Hospital Administrators Association has urged the state government to recruit qualified hospital administrators for permanent positions in government hospitals, including TIMS, to strengthen healthcare management.

81

ఆరోగ్య శాఖ స్పందించాలని డిమాండ్
హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లకు అవకాశం ఎప్పుడు?
ప్రభుత్వ నియామకాలపై అసోసియేషన్ డిమాండ్

తెలంగాణ హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ల సేవలను సమర్థంగా వినియోగించాలని కోరింది. గత పదేళ్లుగా ఈ అంశంపై పోరాటం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సరైన నోటిఫికేషన్లు విడుదల కాలేదని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల పూర్తి కాల కోర్సులు పూర్తి చేసిన 21 వేలకుపైగా నిపుణులు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో మాత్రం వారికి తగిన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకబడిందని విమర్శించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎయిమ్స్, ఈఎస్ఐ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి సేవలను సమర్థంగా వినియోగిస్తున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన టిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీఎం, ఏజీఎం స్థాయి గ్రూప్ పోస్టుల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ డిమాండ్‌ను అసోసియేషన్ ప్రతినిధులు ప్రేమ్ నాయక్, రచన, భారతి, గోపాల్ రెడ్డి కూడా సమర్థించారు.