కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.
గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మత్తు వ్యసనం వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హెచ్చరించారు.పులివెందుల పర్యటనలో భాగంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, స్నేహిత అమృత హస్తం సేవాసమితి రూపొందించిన గంజాయి నిర్మూలన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇటీవల యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను కోల్పోయి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటారని హెచ్చరించారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల నేరప్రవృత్తి, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్న కలెక్టర్, యువత తమ శక్తి సామర్థ్యాలను విద్య, క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని కోరారు.మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో చైతన్యం తీసుకురావడంలో స్నేహిత అమృత హస్తం సేవాసమితి చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ, గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.
.
#AntiGanjaAwareness #DrugFreeYouth #YSRKadapa #CherukuriSridhar #Pulivendula #DrugAbuse #GanjaAddiction #YouthAwareness #AndhraPradesh #AntiDrugCampaign #DrugFreeSociety #PublicAwareness #Education #SocialResponsibility #SayNoToDrugs











