Home AP బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఉత్తర అండమాన్‌ సముద్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అల్పపీడనం సోమవారం వాయుగుండంగా, మంగళవారం తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు సమీపంలోకి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అధికారుల సూచనలు పాటించాలని, తీర ప్రాంత ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని సూచించారు.

 

#BayOfBengal #LowPressureArea #DepressionAlert #APWeather #AndhraPradeshRain #HeavyRainfall #RainAlert #NorthAndhra #CoastalAndhra #OdishaCoast #WeatherUpdate #APWeatherAlert #FishermenAlert #MonsoonUpdate #AndhraPradesh