స్టార్ పొలిటీషియన్ల సంగమం!
విజయవాడ వేదికగా కీలక భేటీ.
చెన్నై దాహం.. రాయలసీమ ప్రయోజనాలు!
చంద్రబాబు, పవన్, లోకేశ్‌తో విజయ్ సమావేశం.
నీటి చుక్క కోసం చెన్నై ఎదురుచూపులు.. సాగునీటి భరోసా కోసం రాయలసీమ ఆశలు.. ఈ రెండింటి మధ్య ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది తెలుగు గంగ! దశాబ్దాల క్రితం ఎన్టీఆర్–ఎంజీఆర్ స్నేహబంధం సాక్షిగా రూపుదిద్దుకున్న ఈ జల ప్రాజెక్టు చుట్టూ, ఇప్పుడు కొత్త తరం స్టార్ రాజకీయాల ఆసక్తికర చర్చ మొదలైంది. అక్టోబర్ 13న విజయవాడ వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశముందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. నారా లోకేశ్ ప్రస్తావనతో ఈ పరిణామంపై మరింత ఆసక్తి నెలకొంది. తెరపై అభిమానులను ఉర్రూతలూగించిన నాయకులు.. ఇప్పుడు ప్రజల దాహాన్ని తీర్చే నిర్ణయాల దిశగా అడుగులు వేస్తారా? 12 టీఎంసీల నీటి ఒప్పందం నుంచి అంతర్రాష్ట్ర ప్రయోజనాల వరకు చర్చించాల్సిన అంశాలు ఎన్నో! చెన్నైకి నీరు అందించాలి.. రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతినకూడదు. రాజకీయ పలకరింపులు చరిత్రలో నిలుస్తాయా? లేక ప్రజలకు నీటి భరోసా ఇచ్చే కార్యాచరణ కొత్త చరిత్రను సృష్టిస్తుందా? స్టార్ ఇమేజ్‌లను మించిన ఈ జల సంగమం వెనుక అసలు కథ ఏమిటి?
#TeluguGangaProject #TamilNaduCMVijay #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #Vijayawada #ChennaiWaterSupply #Rayalaseema #WaterSharing #InterstateWaterAgreement #AndhraPradesh #TamilNadu #PoliticalNews #WaterResources #VijayNews











