వెయ్యి కోట్ల టార్గెట్.. రూ.300 కోట్ల బడ్జెట్.
సూపర్‌స్టార్ రజనీకాంత్ పేరు చెబితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందే! అలాంటి తలైవా ఇప్పుడు ‘జైలర్ 2’తో మరోసారి వెండితెరపై టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా గర్జించేందుకు సిద్ధమయ్యారు. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం గత చిత్రం ‘కూలీ’ స్థాయిని అందుకోలేదన్న చర్చ కోలీవుడ్‌లో వేడెక్కిస్తోంది. ‘కూలీ’ విడుదలకు ముందు బుక్‌మైషోలో సుమారు 20 లక్షల టికెట్లు అమ్ముడవగా, ‘జైలర్ 2’ బుకింగ్స్ ఇప్పటివరకు అందులో సగానికి కూడా చేరలేదన్న సమాచారం ఆసక్తి రేపుతోంది. ప్రపంచవ్యాప్త ప్రీ-సేల్స్ రూ.60 కోట్ల గ్రాస్‌కు చేరువవుతున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ.1,000 కోట్ల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటుందనే ఆశలు రేపిన ఈ సీక్వెల్ ఇప్పుడు ప్రేక్షకుల టాక్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సినిమా బడ్జెట్, స్టార్ హీరోల పారితోషికాలపై వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్ర బడ్జెట్ రూ.240 కోట్ల నుంచి రూ.300 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. రజనీకాంత్‌కు సుమారు రూ.110 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కలిపి, సినిమా మంచి వసూళ్లు సాధిస్తే మొత్తం ఆదాయం రూ.180 కోట్ల వరకు చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. మోహన్‌లాల్‌కు రూ.30 కోట్లు, విద్యాబాలన్‌కు రూ.6 కోట్లు, సూరజ్ వెంజరమూడుకు రూ.కోటి చెల్లిస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.
#Jailer2 #Rajinikanth #Thalaivar #Jailer2BoxOffice #AdvanceBookings #BoxOfficeCollection #Mohanlal #VidyaBalan #SoorajVenjaramoodu #NelsonDilipkumar #TamilCinema #Kollywood #MovieNews











