Home AP “పవర్”ఫుల్ పొజిషన్‌కు పావులు కదుపుతున్న పవన్

“పవర్”ఫుల్ పొజిషన్‌కు పావులు కదుపుతున్న పవన్

తమ్ముడ్ని సీఎం చేయడమే అన్నయ్య విజన్.
చిరు ఆశయానికి జనసైనికుల సపోర్ట్.
తాజా పరిణామాలపై టీడీపీ హై అలర్ట్.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తెరపై కనిపించని ఒక కథ తెరవెనుక వేగంగా నడుస్తోందన్న చర్చ మొదలైంది. కూటమి అధికారంలో ఉన్న వేళ.. భవిష్యత్ సీఎం పీఠంపై జనసేనలో ఆశలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ను సీఎం కుర్చీలో చూడాలన్న ఆకాంక్ష కేడర్‌లో బలపడుతుండగా.. ఆ కలకు అన్నయ్య చిరంజీవి రాజకీయ పునరాగమనం అదనపు బలంగా మారుతుందా? అన్న ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆయనకున్న ప్రజాదరణ, సామాజిక ప్రభావం పవన్ రాజకీయ ప్రయాణానికి ప్లస్ అవుతుందని ఒక వర్గం లెక్కలు వేస్తోంది. రాజ్యసభ సీటు, కేంద్ర మంత్రి పదవి వంటి గౌరవప్రదమైన బాధ్యత లభిస్తే చిరు రీ ఎంట్రీపై ఆలోచించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బీజేపీ ఆసక్తి, జనసేన సీట్ల బేరసారాలు, కాపు సమీకరణాలు ఈ చర్చకు మరింత వేడి పెంచుతున్నాయి. చిరు–పవన్ ఒకే రాజకీయ వేదికపై నిలిస్తే జనసేన బలం పెరగడం ఖాయమని అభిమాన వర్గాలు భావిస్తున్నాయి. కానీ అదే బలం టీడీపీ భవిష్యత్ నాయకత్వ లెక్కలను కదిలిస్తుందా? లోకేశ్ రాజకీయ ప్రయాణంపై ప్రభావం పడుతుందా? చంద్రబాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అన్న ప్రశ్నలు కూటమిలో కొత్త ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు లేదు. అయినా.. అన్నయ్య ఎంట్రీ, తమ్ముడి సీఎం టార్గెట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్‌గా మారింది.

 

#PawanKalyan #PawanKalyanCM #PawanKalyan2029 #JanaSena #JanaSenaParty #Chiranjeevi #ChiranjeeviPoliticalComeback #PawanKalyanChiranjeevi #APPolitics #APPolitics2029 #AndhraPradeshPolitics #TDP #ChandrababuNaidu #NaraLokesh #JanaSenaTDPAlliance #BJP #KapuPolitics #JanaSenaNews #PawanKalyanNews #APPoliticalNews