దిగ్గజాల సరసన చోటు!
300 వన్డే ఇన్నింగ్స్ మైలురాయి.
చరిత్రలో ఐదో భారత బ్యాటర్.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో 300 ఇన్నింగ్స్ ఆడిన ఐదో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజహరుద్దీన్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ 312 వన్డేలు ఆడి 14,797 పరుగులు చేశాడు. అతని సగటు 58.71 కాగా, స్ట్రైక్‌రేట్ 93.82గా ఉంది. ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యధిక ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.











