Home Sports_News ఫ్లెమింగ్ నిష్క్రమణ సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరూ?

ఫ్లెమింగ్ నిష్క్రమణ సీఎస్‌కే కొత్త కోచ్ ఎవరూ?

16


ధోనీ చేతిలో కీలక బాధ్యత.
సూపర్ కింగ్స్ పయనమెటు?

 చెన్నై సూపర్ కింగ్స్, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ దాదాపు 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణానికి ముగింపు పలికాయి. ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన ఈ జోడీ 2023లో చివరి ట్రోఫీని గెలిచినా, ఆ తర్వాత జట్టు ప్రదర్శన క్రమంగా పడిపోయింది. 2024లో ఐదో స్థానం, 2025లో చివరి స్థానం, 2026లో ఎనిమిదో స్థానంతో ముగియడంతో మార్పు అవసరమని ఫ్రాంచైజీ భావించింది. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం వెల్లడించింది. కొత్త ప్రధాన కోచ్ ఎంపికలో మహేంద్ర సింగ్ ధోనీ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈసారి విదేశీ కోచ్ కంటే భారతీయ కోచ్‌కే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో సీఎస్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న ధోనీ కొంత మంది అభ్యర్థులతో సమావేశమయ్యే అవకాశమూ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లెమింగ్ జట్టుకు విజయాలు మాత్రమే కాకుండా ప్రత్యేకమైన సంస్కృతి, క్రమశిక్షణను అందించారని యాజమాన్యం ప్రశంసించింది.