దుబాయ్‌లో హైటెన్షన్ మ్యాచ్.
మహిళల టీ20 ఆసియా కప్-2026 షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. మూడు సార్లు ఛాంపియన్ అయిన భారత జట్టు గ్రూప్-ఏలో పాకిస్థాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్-చైనాతో కలిసి ఉంది. లీగ్ దశలో అత్యంత ఆసక్తికర పోరుగా సెప్టెంబర్ 5న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిలవనుంది. భారత జట్టు ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా, సెప్టెంబర్ 3న హాంకాంగ్-చైనాతో తలపడుతుంది. అనంతరం సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బరిలోకి దిగనుంది. గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆతిథ్య యూఏఈ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో సెమీఫైనల్స్ జరగగా, సెప్టెంబర్ 13న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. టోర్నీలోని మొత్తం 15 మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగనున్నాయి. భారత్-పాకిస్థాన్ పోరుపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
#WomensAsiaCup #IndiaVsPakistan #WomenCricket #TeamIndiaWomen #CricketSchedule #AsianCricketCouncil #DubaiCricket #T20Cricket #IndianWomenCricket #PakistanWomenCricket #CricketNews #SportsNews #AsiaCup2026 #BCCI #CricketFans










