Home Sports_News ధోనీ గది ఎప్పుడూ ఓపెన్ తలుపు మూస్తే నో ఎంట్రీ రహానే ఆసక్తికర వ్యాఖ్యలు

ధోనీ గది ఎప్పుడూ ఓపెన్ తలుపు మూస్తే నో ఎంట్రీ రహానే ఆసక్తికర వ్యాఖ్యలు



టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై మాజీ క్రికెటర్ అజింక్య రహానే ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, సాధారణ వ్యక్తిలా ఉండేవాడని, జట్టులోని ప్రతి ఆటగాడితో స్నేహపూర్వకంగా మెలిగేవాడని చెప్పాడు. ధోనీ గది దాదాపు ఎప్పుడూ అందరికీ తెరిచే ఉండేదని, ఒకేసారి 10 నుంచి 15 మంది ఆటగాళ్లు, కొన్ని సందర్భాల్లో మొత్తం జట్టే అక్కడ గడిపేదని గుర్తు చేశాడు. అయితే ధోనీ గది తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లేవారు కాదని తెలిపాడు. వ్యక్తిగత సమయానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడని వివరించాడు. మరోవైపు సిరీస్ జరుగుతున్న సమయంలో తాను సోషల్ మీడియా యాప్‌లన్నీ తొలగించేవాడినని రహానే వెల్లడించాడు. 2017 ఐపీఎల్ సమయంలో బెన్ స్టోక్స్ ఇచ్చిన సలహాతో ఈ అలవాటు మొదలైందని చెప్పాడు. పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, మరుసటి రోజు కోసం సిద్ధమవడం తన మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగపడిందని వివరించాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే, ధోనీ నాయకత్వంలో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

#MSDhoni #AjinkyaRahane #TeamIndia #IndianCricket #CricketNews #DhoniLeadership #CricketLegends #IPL #BCCI #CricketStories #MahendraSinghDhoni #RahaneInterview #SportsNews #IndianSports #CricketUpdates