భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్‌లో ఎంతటి గోడో చెప్పేందుకు అతడి రికార్డులే నిదర్శనం. టెస్టు క్రికెట్‌లో ద్రవిడ్ ఏకంగా 31,258 బంతులు ఎదుర్కొని ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 29,437 బంతులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో క్రీజులో అత్యధిక సమయం గడిపిన ఆటగాడిగానూ ద్రవిడ్ నిలిచాడు. 286 ఇన్నింగ్స్‌ల్లో 44,152 నిమిషాలు క్రీజులో గడిపాడు. సచిన్ 41,304 నిమిషాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. మరో అరుదైన ఘనతగా టెస్టుల్లో 100కు పైగా పరుగుల భాగస్వామ్యాల్లో 88 సార్లు భాగమయ్యాడు. సచిన్ 86 భాగస్వామ్యాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 164 టెస్టుల్లో ద్రవిడ్ 13,288 పరుగులు, 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు సాధించాడు. 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా కోచ్‌గా కూడా ద్రవిడ్ తన ముద్ర వేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌కు మరో చిరస్మరణీయ అధ్యాయం అందించాడు.
#RahulDravid #TheWall #RahulDravidRecords #TestCricket #IndianCricket #SachinTendulkar #RahulDravidVsSachin #TestRecords #CricketRecords #TeamIndia #IndianCricketLegends #RahulDravidCareer #Dravid #CricketNews











