Home Sports_News రషీద్ రచ్చ ఆఫ్ఘన్‌కు వరల్డ్‌కప్ బెర్త్ ఖరారు

రషీద్ రచ్చ ఆఫ్ఘన్‌కు వరల్డ్‌కప్ బెర్త్ ఖరారు



ఒక వైపు బంతితో బెంబేలెత్తించాడు.. మరోవైపు బ్యాట్‌తో ఆదుకున్నాడు.. మొత్తంగా ఆఫ్ఘనిస్థాన్‌ను 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా తీసుకెళ్లాడు స్టార్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌. బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో రషీద్‌ 3 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్‌ను 206 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘన్‌ 176/7తో తడబడిన సమయంలో రషీద్‌ క్రీజులో నిలిచాడు. 43 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును 45వ ఓవర్లో విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్ఘన్‌ నేరుగా అర్హత సాధించింది. గత ప్రపంచకప్‌లోనూ ఆఫ్ఘనిస్థాన్‌ సత్తా చాటుతూ ఆరో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి జట్లను ఓడించి ప్రపంచ క్రికెట్‌కు తమ ఎదుగుదలను చాటింది. ఇప్పుడు రషీద్‌ సారథ్యంలో మరోసారి వరల్డ్‌కప్‌ బరిలోకి దిగేందుకు బెర్త్‌ ఖాయం చేసుకుంది.

 

#RashidKhan #Afghanistan #AfghanistanCricket #WorldCup2027 #ODIWorldCup #WorldCupQualification #AfghanistanWorldCup #IrelandVsAfghanistan #RashidKhanPerformance #Cricket #CricketNews #ODICricket #AfghanistanCricketTeam #WorldCup2027Qualification #SportsNews