గాయాలతో ఆటగాళ్లు వర్రీ
బీసీసీఐపై నిపుణుల విమర్శలు
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. కోట్లాది రూపాయల కాంట్రాక్టులు.. స్టార్ క్రికెటర్లకు భారీ సౌకర్యాలు.. కానీ ఆటగాళ్ల గాయాలను చూసుకునే టాప్ స్పోర్ట్స్ సైన్స్ నిపుణులను మాత్రం బీసీసీఐ తీసుకురాలేకపోతోందట! ఇదే ఇప్పుడు అసలు ట్విస్ట్. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిస్థితిపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు విని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కూడా అవాక్కయ్యాడు. స్పోర్ట్స్ సైన్స్ హెడ్ కోసం పలువురు నిపుణులను సంప్రదించినా చివరి నిమిషంలో కొందరు వెనక్కి తగ్గారని లక్ష్మణ్ వెల్లడించాడు. ఆండ్రూ లీపస్‌తో ఒప్పందం దాదాపు ఖరారైనా కుటుంబ కారణాలతో ఆయన తప్పుకున్నారని చెప్పాడు. మరో ఆస్ట్రేలియా నిపుణుడు బెంగళూరుకు మారలేనని చెప్పి వైదొలిగాడట. ఇదే కైఫ్‌కు అసలు షాక్. ‘‘బీసీసీఐ పిలిస్తే ప్రపంచంలోని ఆటగాళ్లు ఐపీఎల్ కోసం పరుగెత్తుకొస్తారు. మరి నిపుణులు మాత్రం ఎందుకు రావడం లేదు?’’ అంటూ ప్రశ్నించాడు. మరోవైపు బుమ్రా సహా కీలక ఆటగాళ్ల వరుస గాయాలు జట్టును వేధిస్తున్నాయి. కోట్ల బడ్జెట్ ఉన్న బోర్డుకు నిపుణుల కొరత రావడం క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
#BCCI #BCCICentreOfExcellence #SportsScience #Cricket #IndianCricket #VVS Laxman #MohammadKaif #BCCIExperts #CricketInjuries #JaspritBumrah #InjuryManagement #IndianCricketers #BCCIControversy #TeamIndia #CricketNews











