Home Sports_News తండ్రికి తగ్గ తనయుడు ఫ్లింటాఫ్ మరిపించిన కొడుకు

తండ్రికి తగ్గ తనయుడు ఫ్లింటాఫ్ మరిపించిన కొడుకు


76 బంతుల్లో 123తో రాకీ సత్తా .

ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వారసత్వాన్ని 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్‌ బ్యాట్‌తో చాటుతున్నాడు. వన్‌డే కప్‌లో లాంకషైర్‌ తరఫున సోమర్‌సెట్‌పై రాకీ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 65 బంతుల్లోనే సెంచరీ బాదిన అతడు.. చివరికి 76 బంతుల్లో 123 పరుగులతో మెరిశాడు. ఇందులో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండటం అతడి దూకుడు బ్యాటింగ్‌కు అద్దం పట్టింది. రాకీ ఇన్నింగ్స్‌కు తోడు కీటన్‌ జెన్నింగ్స్‌ 156 పరుగులతో చెలరేగడంతో లాంకషైర్‌ 50 ఓవర్లలో 443/6 పరుగుల భారీ స్కోరు చేసింది. రాకీ ఇప్పటికే ఇంగ్లండ్‌ లయన్స్‌ తరఫున 16 ఏళ్ల వయసులోనే చరిత్ర సృష్టించాడు. 2025లో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేసి.. లయన్స్‌ తరఫున అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్‌ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఐదు ఫస్ట్‌క్లాస్‌, 14 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడిన రాకీ.. తండ్రి బాటలోనే ఆల్‌రౌండ్‌ స్టార్‌గా ఎదగాలని చూస్తున్నాడు. తాజాగా 123 పరుగులతో మరోసారి సత్తా చాటడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌లో ‘నెక్స్ట్‌ ఫ్లింటాఫ్‌’పై అంచనాలు పెరిగాయి.

 

#RockyFlintoff #AndrewFlintoff #Flintoff #Lancashire #Cricket #EnglandCricket #RockyFlintoffCentury #RockyFlintoff123 #LancashireCricket #OneDayCup #Somerset #CricketNews #EnglandCricketNews #NextFlintoff #YoungCricketer