Home Sports_News రోహిత్‌పై బీసీసీఐలో విభేదాలా? సెలక్షన్ కమిటీలో అసంతృప్తా!

రోహిత్‌పై బీసీసీఐలో విభేదాలా? సెలక్షన్ కమిటీలో అసంతృప్తా!



వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికల నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై బీసీసీఐలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిసినా, 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో అతను లేడని సెలక్షన్ కమిటీ భావించినట్లు సమాచారం. అయితే మూడో వన్డేకు రెండు రోజుల ముందు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టు ప్రణాళికల్లోనే ఉన్నాడని ప్రకటించడంతో పరిస్థితి మారింది. ఈ ప్రకటనతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆశ్చర్యానికి గురైనట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీసీసీఐ నిర్ణయం సోషల్ మీడియా ఒత్తిడి కారణంగా మారిందనే భావన సెలెక్టర్లలో వ్యక్తమైనట్లు సమాచారం. రోహిత్‌ను 2027 ప్రపంచకప్ జట్టులో కొనసాగిస్తే టైటిల్ గెలవడం కష్టమని కొందరు సెలెక్టర్లు అభిప్రాయపడినట్లు కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

#RohitSharma #BCCI #AjitAgarkar #TeamIndia #IndianCricket #2027WorldCup #BCCISelectionCommittee #CricketNews #RohitSharmaFuture #VVS Laxman #ODIWorldCup #SportsNews #CricketUpdates