Home AP రాజకీయాల్లో కొన్ని అడుగులు కేవలం ప్రయాణం కాదు.. పునరాగమనానికి సంకేతం.

రాజకీయాల్లో కొన్ని అడుగులు కేవలం ప్రయాణం కాదు.. పునరాగమనానికి సంకేతం.

ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా రోడ్డెక్కిన జగన్‌ అడుగులు వైసీపీని అధికార పీఠం దాకా తీసుకెళ్లాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అదే పాదయాత్ర అస్త్రాన్ని మరోసారి బయటకు తీస్తున్నారన్న ప్రచారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. జగన్‌ 2.0 సిద్ధమవుతోందా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన పాదయాత్ర ప్రణాళికే కనిపిస్తోంది. 2027 జూలై 8.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజునే కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో జగన్‌ ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఓ యాత్ర కాదు.. 2029 లక్ష్యంగా వైసీపీని క్షేత్రస్థాయిలో మళ్లీ కదిలించే వ్యూహమన్న చర్చ మొదలైంది. నాయకుడు మళ్లీ జనంలోకి.. కార్యకర్తలు మళ్లీ రోడ్డుపైకి.. పార్టీ మళ్లీ పోరాట బాటలోకి..! 2017లో పాదయాత్రతో అధికారాన్ని అందుకున్న జగన్‌.. ఇప్పుడు అదే బాటలో కోల్పోయిన అధికారాన్ని తిరిగి అందుకోవాలనుకుంటున్నారా? తండ్రి జయంతి రోజున కుమారుడి తొలి అడుగు.. గత విజయాన్ని గుర్తుచేసే పాదయాత్ర.. 2029ను గురిపెట్టిన రాజకీయ పునర్నిర్మాణం. ముహూర్తం అధికారికంగా ఖరారైందా లేదా అన్నది పక్కన పెడితే.. జగన్‌ వస్తున్నాడు.. కదిలి వస్తున్నాడు.. జగన్‌ 2.0 రెడీ అవుతోందన్న సంకేతాలు మాత్రం రాజకీయ తెరపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

#YSJagan #JaganMohanReddy #Jagan2Point0 #JaganPadayatra #YSRCP #AndhraPradeshPolitics #APPolitics #2029Elections #Padayatra2027 #YSR #YSRajasekharaReddy #PoliticalStrategy #YSRCPRevival #APNews #PoliticalNews