హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, బ్రహ్మకుమారీస్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి విభాగం సంయుక్తంగా నిర్వహించిన ‘సమర్థ నాయకత్వంతో పల్లె ప్రగతి’ సెమినార్‌లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కేవలం నిధులతో సాధ్యం కాదని, విలువలతో కూడిన సమర్థ నాయకత్వం అవసరమని ఆమె స్పష్టం చేశారు. సర్పంచులు ప్రజాసేవలో చిత్తశుద్ధి, నైతిక విలువలు పాటిస్తూ పల్లెలను స్వావలంబన దిశగా నడిపించాలని సూచించారు. నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, విమర్శలను తట్టుకుని మానసిక స్థైర్యంతో ముందుకు సాగాలని చెప్పారు. ఉపసర్పంచుల చెక్ పవర్‌కు సంబంధించి గత ప్రభుత్వ చట్టంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి నిధులు ఆగకుండా, నిధులు నేరుగా సర్పంచులకు అందేలా త్వరలో అసెంబ్లీలో కొత్త బిల్లు తీసుకొస్తామని వెల్లడించారు. కేంద్రం సూచించిన తొమ్మిది ఆదర్శ గ్రామ అంశాలను అమలు చేయాలని కోరారు. సర్పంచుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే శిక్షణ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. నిస్వార్థ ప్రజాసేవే సర్పంచుల ప్రధాన లక్ష్యం కావాలని బ్రహ్మకుమారి సంతోష్ దీదీ సూచించారు.
#TelanganaVillageFunds #Sarpanches #SarpanchFunds #MinisterSeethakka #Seethakka #TelanganaPanchayatRaj #PanchayatRaj #VillageDevelopment #RuralDevelopment #GramPanchayat #TelanganaSarpanches #SarpanchPowers #DeputySarpanch #TelanganaAssembly #TelanganaGovernment #PallePragathi #VillageLeadership #RuralDevelopmentTelangana #LocalGovernance











