మాజీ సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పక హాజరు కావాలని రఘునందన్‌రావు సూచించారు. గజ్వేల్ ప్రజల సమస్యలపై కేసీఆర్ సభలో మాట్లాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పేదల భూముల సమస్యపై తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రజల తరఫున మాట్లాడితేనే గజ్వేల్ ప్రజలకు నిజమైన గౌరవం దక్కుతుందని రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను 22ఏ జాబితాలో చేర్చడం దేశ చరిత్రలోనే అరుదైన పరిణామమని వ్యాఖ్యానించారు. ఆదివారం గజ్వేల్‌లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. దళితులు, గిరిజనులు, అమాయక పేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన పేదల భూములను 22ఏలో చేర్చి భారీ కుంభకోణానికి తెరలేపారని విమర్శించారు. ఈ భూముల వ్యవహారంలో మంత్రులు ఎవరెవరు డబ్బులు పంచుకుంటున్నారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భూములపై జరుగుతున్న వ్యవహారానికి సీఎం బాధ్యత వహించాలని కోరారు. తాతల కాలం నుంచి పేదల చేతుల్లో ఉన్న భూములను 22ఏలో చేర్చొద్దని స్పష్టం చేశారు.
#KCR #RaghunandanRao #KCRAssembly #TelanganaAssembly #Gajwel #GajwelPolitics #22ALands #22A #LandIssues #PoorLandowners #TelanganaLandIssue #RevanthReddy #CongressGovernment #TelanganaPolitics #BJP #BJP Telangana #KCRNews #TelanganaAssemblySession #FarmersIssues #DalitLandIssues #TribalLandIssues











