Home General 20 ప్రాంతాల్లో ఆధునిక గోడౌన్లు – ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు

20 ప్రాంతాల్లో ఆధునిక గోడౌన్లు – ధాన్యం నిల్వ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు

8

రాష్ట్రంలో ధాన్యం నిల్వ వ్యవస్థను మరింత ఆధునికంగా, శాస్త్రీయంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రధాన వరి ఉత్పత్తి జిల్లాల్లో 20 ప్రాంతాల్లో అత్యాధునిక గోడౌన్లు ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రారంభ దశలో 50 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో నెట్‌వర్క్ అభివృద్ధి అవకాశాలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ధాన్యం కొనుగోలు వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదని, అనుబంధ మౌలిక వసతులుగా మాత్రమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో స్వయం సహాయక సంఘాలు, ఇకేపీ కేంద్రాలు, పీఏసీఎస్‌ల పాత్ర భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిల్వ నష్టాల తగ్గింపు, ధాన్యం నాణ్యత పరిరక్షణ, రవాణా వేగవంతం, సరఫరా వ్యవస్థ సమర్థత పెంపు ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలన్నారు. సాంకేతికత ఆధారిత నిల్వ, రవాణా వ్యవస్థలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు.

#UttamKumarReddy #Telangana #PaddyStorage #GrainStorage #ModernWarehouses #AgricultureInfrastructure #FoodCivilSupplies #RiceProcurement #Farmers #Agriculture #WarehouseNetwork #FoodSecurity #PaddyFarmers #StorageFacilities #RuralDevelopment #SupplyChain #AgricultureDevelopment #TelanganaGovernment #PACS #SelfHelpGroups #EKP #FoodGrainStorage #FarmerWelfare #ModernTechnology #Logistics #TelanganaNews #AgricultureNews #BreakingNews #LatestNews #InfrastructureDevelopment