Home General భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యం

7

రాష్ట్రంలో భూ సమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే నెల నుంచి దశల వారీగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాల్లో తొలి దశగా హైదరాబాద్ మినహా 32 జిల్లాల నుంచి 2,240 గ్రామాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. నిజాం కాలం నాటి పాత రికార్డులు, మారిన భూ సరిహద్దులు, పెరిగిన సర్వే నంబర్ల కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు ఆధునిక సాంకేతికతతో రీసర్వే చేపడుతున్నట్లు వివరించారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ వంటి అత్యాధునిక పరికరాలతో భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తిస్తామని తెలిపారు. రీ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూమికి ప్రత్యేక భూదార్ నంబర్, భూదార్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. భూ భారతి పోర్టల్‌లో అన్ని వివరాలు నమోదు చేయడంతో భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మరింత పారదర్శకంగా మారుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 

#PonguletiSrinivasaReddy #LandResurvey #Telangana #RevenueDepartment #BhuBharati #Bhoodhar #LandRecords #LandSurvey #GIS #DGPS #RoversTechnology #LandDisputes #RevenueReforms #DigitalLandRecords #LandManagement #PropertyRecords #LandOwnership #SurveyNumbers #RevenueVillages #TelanganaGovernment #Transparency #LandRegistration #MutationProcess #ModernTechnology #Governance #PublicAdministration #TelanganaNews #BreakingNews #LatestNews #LandReforms