Home AP అక్టోబర్‌ 1న ఇంటింటికీ పెన్షన్

అక్టోబర్‌ 1న ఇంటింటికీ పెన్షన్

తెల్లవారుజాము నుంచే పంపిణీ.
61.80 లక్షల మందికి ఎన్టీఆర్‌ భరోసా.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ అక్టోబర్‌ 1న ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 61.80 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్‌ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాంకు ఉద్యోగులు సమ్మెను వాయిదా వేసినందున బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ జరిగేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది సెప్టెంబర్‌ 30నే బ్యాంకుల నుంచి పెన్షన్‌ మొత్తాలను తీసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు.

రూ.2,692 కోట్ల నిధులు సిద్ధం

అక్టోబర్‌ నెల పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,692.34 కోట్లు విడుదల చేసింది. ఇందులో రూ.2,692.28 కోట్లు ఇప్పటికే పంచాయతీలు, వార్డుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. గజపతినగరం మండలంలోని జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం లబ్ధిదారులకు డీబీటీ ద్వారా మరో రూ.6 లక్షలు జమ చేయనున్నట్లు వివరించారు. పెన్షన్‌ పంపిణీలో ఆలస్యం లేకుండా జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్‌ఎల్‌బీసీ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 30న అవసరమైన నగదును సిద్ధంగా ఉంచి, అక్టోబర్‌ 1న లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్‌ అందేలా చూడాలని సూచించారు.

 

#NTRBharosa #APPensions #PensionDistribution #AndhraPradesh #SocialSecurityPension #PensionScheme #APGovernment #October1 #PensionBeneficiaries #NTRBharosaPension #APNews #PensionPayment #DoorToDoorPension #KondapalliSrinivas