నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి, ఆధాన్, పొలిటికోస్, హెచ్ఎంటీవీలలో రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. ఏపీ ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ లో పీఆర్ఓ(అవుట్ సోర్సింగ్)గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అనలిస్ట్ గా చేశారు. కొద్ది కాలంపాటు తెలుగుదేశం పార్టీ పత్రిక ‘చైతన్య రథం’ బాధ్యతలుగా వ్యవహరించారు. తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలలో అన్ని రంగాలపై 700లకు పైగా వ్యాసాలు రాశారు. పుస్తక సమీక్షలు రాశారు. రాస్తున్నారు. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.