డీఎస్సీ పేరుని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించేయత్నం
కోటి మంది పసుపు సైన్యం, జనసేన, బీజేపీ సైన్యం కలిసి వస్తే మీరు తట్టుకోగలరా?
దమ్ముంటే డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌ని జగన్ స్వీకరించాలి
టీటీడీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రెస్ మీట్
విజయవాడ: గొడ్డలి పార్టీ జెన్‌జీ ఉద్యమం ముసుగులో అరాచక శక్తులతో రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తోందని టీటీడీ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్రా కార్పోకేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. వాళ్ల జెన్ జీ వెనుక అసాంఘిక శక్తులు, గంజాయి బ్యాచ్, రౌడీ మూకలు ఉన్నాయన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ పేరుని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా నిన్న రౌడీ మూకలు సృష్టించిన హడావుడి చూసి ప్రజలే ఎదురు తిరిగారన్నారు.
తమకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందని, మీలాగా తాము అనుకుంటే కోటి మంది పసుపు సైన్యం ముందు మీరు నిలబడగలరా? అని ప్రశ్నించారు. మా జనసేన, బీజేపీ సైన్యం కలిసి వస్తే మీరు తట్టుకోగలరా? అని అడిగారు. దమ్ముంటే డీఎస్సీపై మా మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్ స్వీకరించి జగన్ ను చర్చకు రమ్మని చెప్పండని హితవు పలికారు. విజయవాడ నడిబొడ్టున బస్టాప్ ను ఆక్రమించారని ప్రజలు ఫిర్యాదు చేస్తే, వారి ఆవేదనను అర్ధం చేసుకుని ఒక ప్రజాప్రతినిధిగా స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమ వెళ్లడం తప్పా అని అడిగారు. దేవరపల్లి పర్యటనలో వైసీపీ నేతలు మద్యం మత్తులో సృష్టించిన వీరంగం అందరూ చూశారన్నారు. గొడ్డలి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదో వాగుతున్నాడని మండిపడ్డారు. మా చంద్రబాబు ఒక్క సైగ చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావో ముందు తెలుసుకో అని హెచ్చరించారు. నీ తండ్రి మాటలే నువ్వు పట్టించుకోవు, మాకు నీతులు చెబుతావా? అని అడిగారు. 2019-24 మధ్య ఎన్నో హిందూ దేవాలయాలపై దాడులు చేసి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తే, ఆనాడు ఈ బ్రాహ్మణ సామాజిక వర్గ నాయకుడు ఏమయ్యాడని మల్లాది విష్ణుని ఉద్దేశించి ప్రశ్నించారు. హిందూ మతంపై దాడులు చేస్తే… జగన్ ను సమర్ధించాడని విమర్శించారు. కల్తీ మద్యంతో కొంతమంది ప్రాణాలు తీసిన వ్యక్తి మల్లాది విష్ణు అని, అతని సామాజిక వర్గమే అతన్ని వెలివేసిందన్నారు. శాసన మండలి సభ్యురాలైన తమ నాయకురాలు పంచుమర్తి అనురాధను కించపరిచేవిధంగా మాట్లాడిన మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గ నేత ఎలా అవుతారని ప్రశ్నించారు. విజయవాడ నగరంలో రౌడీ మూకలను వేసుకుని రోడ్ల మీదకు వస్తే తోలు తీస్తాం అన్నారు. అవినాష్, వెల్లంపల్లి ఎవరైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలే తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు. రెండేళ్లుగా ఓపిక పట్టాం, ఇక నోరు పారేసుకున్నా, రప్పారప్పా అన్నా సహించం అన్నారు. దేవినేని అవినాష్ మైండ్ యువర్ లాంగ్వేజ్, నీ గుణదల బ్యాచ్ కి దడిసేవాడు లేడన్నారు. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు, నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. నీకు చిప్పకూడు తప్పదు, సిద్దంగా ఉండని హెచ్చరించారు. సైకో పార్టీ ఆగడాలను కూటమి పార్టీ నేతలు తిప్పికొట్టడం ఖాయం అని పట్టాభిరామ్ అన్నారు.
ఈ సమావేశంలో ఏపీ భవననిర్మాణ కార్మికుల సలహా మండలి చైర్మన్ జి.రఘురామ రాజు, టీటీపీ నేతలు కాకు మల్లికార్జున యాదవ్, దాసరి ఉదయ కరుణశ్రీ, యువనేత చరణ్ శాయి తదితరులు పాల్గొన్నారు.
#KommaReddyPattabhiram #TDP #YSRCP #AndhraPradesh #Vijayawada #GenZMovement #DSC #NaraLokesh #JaganMohanReddy #ChandrababuNaidu #JanaSena #BJP #VijayawadaCentral #APPolitics #PoliticalNews #AndhraPradeshPolitics











