Home AP రేపో మాపో కొత్త పార్టీ

రేపో మాపో కొత్త పార్టీ

శ్రావణ మాసంలో ముహూర్తం ఖరారు.
భారత్ జన వికాస్, ఆ పార్టీకి దగ్గరగా పేరు.
పార్టీ పెట్టి సాయిరెడ్డి చెప్పే సత్యం ఏంటి?
ఎవరితో ఫైట్… ఎవరు టార్గెట్.

వైసీపీ వ్యూహకర్తగా, జగన్‌కు అత్యంత సన్నిహిత రాజకీయ నాయకుడిగా ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అదే రాజకీయ అనుభవాన్ని కొత్త అస్త్రంగా మలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారా? రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన కొద్దికాలానికే మళ్లీ కొత్త పార్టీతో తెరపైకి రావడం వెనుక సాధారణ రాజకీయ పునరాగమనం కంటే పెద్ద వ్యూహమే ఉందన్న చర్చ మొదలైంది. ‘భారత్ జన వికాస్’ పేరుతో శ్రావణం సుముహూర్తంలో పార్టీని ఆవిష్కరించనున్నారన్న ప్రచారం ఈ చర్చకు మరింత ఊపు తెచ్చింది. అసలు ఎందుకు పార్టీ? ఏమిటి లక్ష్యం? ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? అన్న మూడు ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాలను వెంటాడుతున్నాయి. వైసీపీ బలహీనతలను దగ్గరగా చూసిన అనుభవం, ఢిల్లీ రాజకీయాలపై పట్టు, కూటమి–వైసీపీ మధ్య ఉన్న రాజకీయ ఖాళీపై అవగాహన.. ఇవన్నీ సాయిరెడ్డికి కొత్త ప్రయోగానికి బలంగా మారే అవకాశముంది. మరోవైపు ‘భారత్’, ‘వికాస్’ వంటి పదాలతో పార్టీ పేరు బీజేపీ రాజకీయ భాషకు దగ్గరగా కనిపించడం భవిష్యత్ వ్యూహంపై కొత్త సందేహాలు రేపుతోంది. అయితే పేరు కంటే ముఖ్యం పార్టీ సిద్ధాంతం, కేడర్, నాయకత్వం, ప్రజా విశ్వసనీయత. 2029ను టార్గెట్‌గా చేసుకుని మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారా? వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలనుకుంటున్నారా? లేక బీజేపీకి అనుకూలమైన రాజకీయ వేదికగా మారాలనుకుంటున్నారా? సాయిరెడ్డి కొత్త రాజకీయ అధ్యాయం వెనుక అసలు స్కెచ్ ఏమిటన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న.

 

#VijayaSaiReddy #NewPoliticalParty #BharatJanaVikas #AndhraPradeshPolitics #APPolitics #YSRCP #YSJagan #2029Elections #PoliticalStrategy #PoliticalComeback #ThirdFront #BJP #AndhraPradesh #VijayasaiReddy #APPoliticalNews