Home AP మున్సిపల్ కార్మికులతో ధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్

మున్సిపల్ కార్మికులతో ధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్

విజయవాడ: అనంతపురం, గుంతకల్, కళ్యాణదుర్గం ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ మూడు ప్రాంతాల నుంచి సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల నినాదాలతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. ధర్నా అనంతరం మున్సిపల్ కార్మికులు, నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చివరకు అధికారులు దిగి వచ్చారు. అసిస్టెంట్ సీడీఎంఏ ధర్నా స్థలానికి వచ్చి మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్లి తొందరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో, కార్మికులు ఆందోళన విరమించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

కార్మికుల డిమాండ్స్ :

1. అనంతపురం, గుంతకల్, కళ్యాణదుర్గం పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలి.
2. కార్మికులందరికి ఒకే విధంగా రూ. 36 వేల జీతం ఇవ్వాలి.
3. ఔట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలి.
4. మరణించిన, రిటైర్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరి ఉద్యోగ అవకాశం కల్పించాలి.
5. స్కూల్ స్వీపర్ వాచ్మెన్లను ఫుల్ టైం కంటెంట్ వర్కర్స్ గా గుర్తించి, 16 వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి.
6. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలి.
7. మున్సిపల్ రంగాన్ని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పే 975,673 జీవోలను రద్దు చేయాలి.
8. పీఎఫ్,ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలి.
9. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
10. మున్సిపల్ కార్మికుల సంక్షేమ కోసం ప్రతి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ శివకృష్ణ, అనంతపురం జిల్లా నాయకులు వేణుగోపాల్, కొండయ్య,వెంకటేష్,తిరుమలయ్య, రఫీ, వాసు, నాగరాజ్, ఇషాక్, దేవమ్మ, కాంతమ్మ, సుజాత, ఇందిరమ్మ, తిప్పమ్మ, కళావతి, రసూల్. బి, రవి, రాజు, తిమ్మప్ప, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Previous articleఅయోధ్య ట్రైలర్ మాత్రమే… కాశీ, మధుర నెక్స్ట్ వెలుగులోకి
Next articleఈరోజు సీఎం చంద్రబాబు షెడ్యూల్
శిరందాసు నాగార్జున
నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి, ఆధాన్, పొలిటికోస్, హెచ్ఎంటీవీలలో రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. ఏపీ ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ లో పీఆర్ఓ(అవుట్ సోర్సింగ్)గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అనలిస్ట్ గా చేశారు. కొద్ది కాలంపాటు తెలుగుదేశం పార్టీ పత్రిక ‘చైతన్య రథం’ బాధ్యతలుగా వ్యవహరించారు. తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలలో అన్ని రంగాలపై 700లకు పైగా వ్యాసాలు రాశారు. పుస్తక సమీక్షలు రాశారు. రాస్తున్నారు. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.