రూ.24 లక్షలు సీజ్ చేసిన అధికారులు .
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్, కడపలోని ఏడు ప్రాంతాల్లో పీఎంఎల్ఏ కింద ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అవినాష్‌రెడ్డి నివాసం నుంచి లెక్క చూపని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంక్ లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది. నేరానికి సంబంధించినట్లు భావిస్తున్న కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపింది. వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఈడీ స్పష్టం చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, మూడు చార్జ్షీట్ల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. దీంతో సుదీర్ఘకాలంగా రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా ఉన్న వివేకా హత్య కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
#YSAvinashReddy #EDRaids #KadapaMP #VivekanandaReddyMurderCase #EnforcementDirectorate #PMLA #EDSearches #CashSeized #KadapaNews #CBI #MoneyLaundering #AndhraPradeshPolitics #YSVivekanandaReddy #BreakingNews











