ఊరిస్తున్న సీఎం సీటు.. ఉసూరుమనిపిస్తారని జనసైనికుల డౌటు.
పవన్ దూకుడు దేనికి సంకేతం.. సీట్ల బేరానికేనా పరిమితం.
2024లో 21కి 21.. ఇప్పుడు 2029పై కొత్త లెక్క! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ మొదలైన తాజా చర్చ కేవలం సీట్ల పెంపు గురించా? లేక సీఎం కుర్చీ దిశగా రాజకీయ వాటాను పెంచుకునే వ్యూహానికి ఇది ఆరంభమా? దశాబ్దాలుగా రెడ్లు–కమ్మల ఆధిపత్య చర్చల చుట్టూ తిరిగిన ఏపీ అధికార గణితంలో కాపు రాజకీయ ఆకాంక్ష మరోసారి కేంద్రబిందువుగా మారుతోంది. వంగవీటి రాధాకృష్ణతో పవన్ భేటీ.. వైసీపీ, టీడీపీ నేపథ్యం ఉన్న నాయకులు జనసేన వైపు అడుగులు.. స్థానిక ఎన్నికలపై పవన్ ప్రత్యేక దృష్టి.. ఇవన్నీ కలిపి చూస్తే ఏదో పెద్ద రాజకీయ పునర్వ్యవస్థీకరణకు సంకేతాలా అన్న ఆసక్తి పెరుగుతోంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాపు బలం ఒక్కటే అధికారానికి సరిపోతుందా? 21 సీట్ల విజయాన్ని రాష్ట్రవ్యాప్త కేడర్‌గా మార్చగలరా? టీడీపీతో కూటమిని కాపాడుకుంటూనే జనసేన తన వాటాను పెంచుకోగలదా? స్థానిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలే ఈ ప్రశ్నలకు తొలి జవాబు ఇవ్వబోతున్నాయి. సీఎం కుర్చీపై చూపు ఉండొచ్చు.. కానీ అక్కడికి చేరే దారి మాత్రం బూత్‌ల మీదుగానే సాగాలి. ఆ దారిలో పవన్‌కు ఎదురయ్యే అసలు పరీక్షలు ఏంటి? కాపు రాజకీయానికి ఈసారి కొత్త మలుపు తప్పదా?
#PawanKalyan #JanaSena #JanaSenaParty #APPolitics #AndhraPradeshPolitics #PawanKalyan2029 #JanaSena2029 #TDPJanaSena #NDAAlliance #SeatSharing #KapuPolitics #APLocalElections #VangaveetiRadha #PoliticalStrategy #AndhraPradesh











