Home AP కడపలో కసామిసా… ఒకే రోజు మూడు బాంబులు

కడపలో కసామిసా… ఒకే రోజు మూడు బాంబులు

కూటమిలో కల్లోలం రేపిన జడ్పీ పీఠం రేసు సీన్
తిరుగులేదనుకున్న ఆదిని సైడ్ చేసిన టీడీపీ హైకమాండ్
జడ్పీ పీఠంపై పుత్తా నరసింహారెడ్డి ప్రకటనతో కలకలం
పెట్రోల్ బాంబులతో దాడులు, అవినాష్‌రెడ్డి వర్సెస్ బీటెక్ రవి
వైసీపీ ఎంపీ అవినాష్‌పై హత్యాయత్నం ఆరోపణలు

నవంబర్ 20.. కడప రాజకీయ చరిత్రలో మరో కీలక రోజు! ఒకే జిల్లాలో మూడు రాజకీయ ప్రకంపనలు.. ఒకటి పెట్రోల్ బాంబుల ఆరోపణలతో రణరంగంగా మారిన పులివెందుల.. రెండోది టీడీపీ, బీజేపీ మధ్య ఆధిపత్య పోరుతో రగిలిన జిల్లా పరిషత్ పీఠం.. మూడోది రాజీనామా హెచ్చరికలతో కూటమిలో కలకలం రేపిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి! అంకాలమ్మగూడూరు వద్ద వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వేడిని పెంచితే.. బీటెక్ రవి వర్గం ఆ ఆరోపణలను ఖండించడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో కడప జడ్పీ పీఠం టీడీపీకి చెందిన పుత్తా నరసింహారెడ్డికి దక్కడంతో బీజేపీ ఎమ్మెల్యే ఆది అసంతృప్తి బహిరంగమైంది. బుజ్జగింపులు సాగుతున్నా వెనక్కి తగ్గని ఆయన.. రాజకీయ సమీకరణాలనే మార్చేస్తానంటూ హెచ్చరించడం కూటమి పెద్దలకు కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు పుత్తా కుటుంబానికి జిల్లా రాజకీయాల్లో కొత్త ప్రాధాన్యం రావడం టీడీపీలోనూ ఆసక్తికర చర్చకు తెరతీసింది. పులివెందులలో వైసీపీ–టీడీపీ పోరు.. జడ్పీ పీఠంపై కూటమి కుమ్ములాట.. టీడీపీలో కొత్త ఆధిపత్య సమీకరణాలు! ఇవన్నీ యాదృచ్ఛిక పరిణామాలా? లేక కడప రాజకీయాల్లో కొత్త శక్తికేంద్రాల ఆవిర్భావానికి సంకేతాలా? మూడు బాంబులు పేలాయి.. ఇప్పుడు రాజకీయంగా ఎవరి పీఠం కదులుతుందన్నదే అసలు ఉత్కంఠ!

 

#KadapaPolitics #PuttaNarasimhaReddy #AdinarayanaReddy #YSAvinashReddy #BTechRavi #Pulivendula #ZPChairperson #TDP #BJP #YSRCP #AndhraPradeshPolitics