Home Cinema_News ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ విడుదల

ఈ సీజన్‌లో సరికొత్త బ్రీజీ లవ్ ఆంథమ్‌గా అలరిస్తున్న పాట!

యువ కథానాయకుడు రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమో ఎమో ఇది’. డా. శైలేష్ కొలను రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

చిత్ర ప్రకటన సమయంలో విడుదల చేసిన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ #EmoEmoIdi’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఆ వీడియోతో సినిమాలోని ఆహ్లాదకరమైన ప్రేమకథా ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు మరింత అందమైన అనుభూతిని పంచేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ మధ్య కనిపించే అందమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో తెరకెక్కించిన విజువల్స్ పాటకు డ్రీమీ రొమాంటిక్ ఫీల్‌ను అందిస్తున్నాయి.

ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అద్భుతమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి.

రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డా. శైలేష్ కొలను రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రేమ, భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన అనుభూతులతో తెరకెక్కుతున్న ‘ఎమో ఎమో ఇది’ చిత్రం అక్టోబర్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

 

#EmoEmoIdi #EmoEmoIdiTitleSong #RoshanMeka #PreethiMukundan #HeshamAbdulWahab #SaileshKolanu #Karthik #RamyaBehara #KrishnaKanth #SitharaEntertainments #FortuneFourCinemas #TeluguCinema #LoveAnthem #RomanticMovie #October30Release