కూటమికి ఓటమి భయమన్న వైసీపీ.
మాజీ మంత్రి గుడవాడ విమర్శలు.
స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఉన్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నాయని ఆయన విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. గత స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకునే ప్రయత్నం చేసిందని, ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన విషయాన్ని అమర్నాథ్ గుర్తుచేశారు. చంద్రబాబులా వైఎస్ జగన్ ఎప్పుడూ ఎన్నికల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.30 కోట్లు, ఉద్యోగులకు రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మరో 15 రోజుల్లో బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 21న భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకుంటామని అమర్నాథ్ స్పష్టం చేశారు.
#GudivadaAmarnath #YSRCP #LocalBodyElections #APLocalElections #AndhraPradeshPolitics #TDP #JanaSena #BJP #NDAAlliance #TDPJanaSenaBJP #YSRCPPolitics #ChandrababuNaidu #YSJagan #ChodavaramSugarFactory #APPolitics #LocalElections











