Home General దేవరకద్రలో 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం

దేవరకద్రలో 22 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం

పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో 22 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి కాంక్రీట్‌ పనులు ప్రారంభించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు 2,720 మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌకుంట్లలో మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక ల్యాబ్‌లు, డిజిటల్‌ తరగతి గదులు, హాస్టల్‌ సదుపాయాలతో విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. విద్యారంగంలో మౌలిక వసతులను బలోపేతం చేసి పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాల విద్య అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

 

#Devarakadra #IntegratedSchool #YoungIndiaIntegratedSchool #TelanganaEducation #MadhusudhanReddy #Damagnapur #Chinnachintakunta #GovernmentSchools #FreeEducation #QualityEducation #DigitalClassrooms #ModernLabs #TelanganaNews #EducationNews