భారత్‌తో మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ క్రమశిక్షణా షాక్ తగిలింది. శనివారం దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేసిన అనంతరం ఫాతిమా పెవిలియన్ వైపు సైగ చేయడం వివాదానికి దారితీసింది. బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా చర్యలు, సంజ్ఞలు చేయరాదన్న ఐసీసీ కోడ్‌లోని ఆర్టికల్ 2.5ను ఆమె ఉల్లంఘించినట్లు మ్యాచ్ అధికారులు నిర్ధారించారు. దీంతో మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఫాతిమా తప్పును అంగీకరించి, ప్రతిపాదిత శిక్షను స్వీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే చర్యలు ఖరారయ్యాయి. గతంలో 2025 ఆగస్టు 6న ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లోనూ ఆమెకు ఒక డీమెరిట్ పాయింట్ నమోదైంది. తాజా పాయింట్‌తో 24 నెలల వ్యవధిలో ఆమె ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు చేరాయి. నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారి నిషేధానికి దారితీస్తాయి. రెండు సస్పెన్షన్ పాయింట్లు వస్తే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లపై నిషేధం పడే అవకాశం ఉంటుంది.
#FatimaSana #FatimaSanaPenalty #FatimaSanaFined #ICC #ICCCodeOfConduct #DemeritPoint #PakistanWomen #PakistanCricket #ShafaliVerma #IndiaVsPakistan #WomensAsiaCup #WomensCricket #CricketNews #ICCPenalty #CricketControversy #PakistanCaptain #IndiaPakistanCricket #ICCAction #FatimaSanaNews











