Home Sports_News ఢిల్లీలో కొత్త బంధం.. కాబూల్‌కు క్రికెట్ వేదిక

ఢిల్లీలో కొత్త బంధం.. కాబూల్‌కు క్రికెట్ వేదిక

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంతి బౌండరీ దాటింది.. కానీ ఆ మూడు టీ20ల కథ అక్కడితో ముగియలేదు. భారత్‌–ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య క్రికెట్‌ మైదానంలో మొదలైన అనుబంధం ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాగా మారింది. స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేక భారత్‌ను హోమ్‌ వేదికగా ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌.. తొలిసారి భారత జట్టునే ఢిల్లీలో తన ‘హోమ్‌ సిరీస్‌’కు ఆహ్వానించడం ఆసక్తిని రేకెత్తించింది. ‘ఫ్రెండ్‌షిప్‌ కప్‌’గా జరిగిన ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లను భారత్‌ గెలిచినా.. అసలు విజయం స్కోర్‌బోర్డులో కనిపించలేదు. 20 వేలకు పైగా ప్రేక్షకుల మధ్య రెపరెపలాడిన ఆఫ్ఘన్‌ జెండాలు, పఘ్మాన్‌ చరిత్రకు ప్రతీకగా నిలిచిన ‘తాక్‌-ఎ-జఫర్‌’, స్టేడియంలో మార్మోగిన చప్పట్లు.. రెండు దేశాల క్రికెట్‌ బంధానికి కొత్త రూపాన్ని చూపించాయి. గ్రేటర్‌ నోయిడా నుంచి లక్నో, డెహ్రాడూన్‌ మీదుగా ఇప్పుడు ఢిల్లీకి చేరిన ఆఫ్ఘన్‌ క్రికెట్‌ ప్రయాణం వెనుక అసలు కథ ఏమిటి? స్వదేశం లేని జట్టుకు భారత్‌ ఎలా క్రికెట్‌ నిలయంగా మారింది? ఢిల్లీ వేదికగా మొదలైన ఈ కొత్త అధ్యాయం రేపటి భారత్‌–ఆఫ్ఘన్‌ మైత్రికి ఎలాంటి దిశ చూపించబోతోంది?

 

#IndiaAfghanistanCricket #AfghanistanCricket #IndiaCricket #FriendshipCup #ArunJaitleyStadium #DelhiCricket #AfghanistanHomeSeries #CricketDiplomacy #AfghanCricket #TeamIndia #AfghanistanTeam #CricketRelations #IndiaAfghanistanRelations #Delhi #CricketNews