తప్పెవరిది? శిక్షెవరికి?
కాంగ్రెస్ అగ్రెసివ్.. బీఆర్ఎస్ ఎఫెన్స్.
ఫామ్‌హౌస్‌ల చుట్టూ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ఆరోపణలు.. బీఆర్ఎస్ ఎదురుదాడులు.. అధికారుల సర్వేలు.. నేతల పర్యటనలు.. ఇలా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భూములపై అక్రమాలు జరిగాయంటే విచారణ జరపడం ప్రభుత్వ బాధ్యతే. తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఆధారాలు తేలకముందే అధికార పార్టీ నేతలు ఫామ్‌హౌస్‌ల వద్దకు వెళ్లి రాజకీయ రచ్చ చేయడంపై ప్రశ్నలు మొదలయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా ప్రతి విచారణను రాజకీయ కక్షగా కొట్టిపారేయడం, ప్రతిగా ఆరోపణలు చేయడం చర్చకు దారితీస్తోంది. కేటీఆర్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జన్వాడ ఫామ్‌హౌస్ నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వరకు వ్యవహారంపై రచ్చ సాగుతోంది. అసలు భూమి ఎవరిది? నిర్మాణాలకు అనుమతులున్నాయా? ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందా? ఆరోపణల్లో నిజమెంత? రాజకీయ రచ్చ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానాలు రికార్డుల్లోనే ఉన్నాయి. ప్రజలు కోరుకునేది ఒక్కటే.. పార్టీ చూసి కాదు.. తప్పు చూసి శిక్షించాలి. కాంగ్రెస్ అధికార దూకుడైనా, బీఆర్ఎస్ ఓవరాక్షన్ అయినా.. రెండింటినీ ప్రశ్నించాల్సిందే.
#TelanganaFarmhouseRow #TelanganaLandRow #Congress #BRS #KTR #KCR #JanwadaFarmhouse #ErravelliFarmhouse #FarmhouseControversy #LandSurvey #LandOwnership #GovernmentLand #TelanganaPolitics #CongressVsBRS #TelanganaNews











