విజయవాడలో వార్డు సచివాలయ ఉద్యోగులు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ భారీ నిరసన చేపట్టిన రోజే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు కేటగిరీల ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఛానళ్లను అమల్లోకి తెచ్చింది. 2019లో నియమితులైన పలువురు ఉద్యోగులు ఆరేళ్లకు పైగా సేవలందించినా పదోన్నతులు లేక కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు గ్రేడ్-2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు గ్రేడ్-2 ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చారు.
2,445 పోస్టులతో కేడర్ పునర్వ్యవస్థీకరణ
ప్రభుత్వం 915 మిగులు, ఖాళీ పోస్టులను రేషనలైజ్ చేసి 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 458 వార్డు అమెనిటీస్ సెక్రటరీ గ్రేడ్-2, 457 వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. అదనంగా శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్, ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కేడర్లలో 815 చొప్పున మొత్తం 1,630 పోస్టులను గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేశారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా ఎదిగే అవకాశం కల్పించారు. శానిటేషన్ సిబ్బందికి గ్రేడ్-1, హెల్త్ అండ్ శానిటేషన్ అసిస్టెంట్ మార్గం, ప్లానింగ్ సిబ్బందికి టీపీబీవో పోస్టుల వరకు పదోన్నతి అవకాశం ఉంటుంది. అదనపు ఆర్థిక భారం లేకుండానే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు.
#WardSecretariat #APWardSecretariat #EmployeePromotions #APEmployees #PromotionChannels #WardAdministrativeSecretary #DataProcessingSecretary #SanitationSecretary #PlanningSecretary #APGovernment #CareerGrowth #JuniorAssistant #SeniorAssistant #TPBO #AndhraPradesh











