Home AP విధి నిర్వహణలో సీఐ అహ్మద్ అలీ మృతి

విధి నిర్వహణలో సీఐ అహ్మద్ అలీ మృతి

ధర్నా బందోబస్తులో ఒక్కసారిగా కుప్పకూలి.

విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న నున్న సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ అలీ (50) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం గాంధీనగర్‌ ధర్నాచౌక్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు బందోబస్తు విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో నిరసనకారులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అహ్మద్‌ అలీ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే తోటి సిబ్బంది ఆయనకు ప్రాథమిక సహాయం అందించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.

కుటుంబానికి అండగా ఉంటామన్న హోంమంత్రి

అహ్మద్‌ అలీ ఆకస్మిక మరణంతో ధర్నాచౌక్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిలో విషాదం నెలకొంది. విధి నిర్వహిస్తూ క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో సహచరులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత అహ్మద్‌ అలీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉండగానే అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 

#AhmedAli #Vijayawada #CircleInspector #NunnaCI #APPolice #PoliceOfficer #DeathOnDuty #HeartAttack #VijayawadaProtest #DharnaChowk #SecretariatEmployees #PoliceBandobast #VangalapudiAnitha #AndhraPradesh #APNews