Home AP ఫ్యాషనవుతున్న ఫ్యాక్షనిజం

ఫ్యాషనవుతున్న ఫ్యాక్షనిజం

నాడు నాటు బాంబులు.. నేడు పెట్రోల్ బాంబులు.
ఆయుధాలు మారినా, మారని రక్తచరిత్ర.
ఎన్నికల వేళ రగిలిన సీమ ఫ్యాక్షన్ రాజకీయాలు!
పాత కక్షలే కొత్త ఆయుధాలు, మళ్లీ కల్లోలం!

ఒకప్పుడు నాటు బాంబుల మోతతో వణికిన రాయలసీమ.. ఇప్పుడు పెట్రోల్ బాంబుల ఆరోపణలతో ఉలిక్కిపడుతోంది! కత్తులు, వేటకొడవళ్ల స్థానంలో రాళ్లు, కర్రలు.. ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు.. వాహనాలకు నిప్పు.. ఎన్నికల వేళ నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వరకు ఉద్రిక్తతలు! పులివెందులలో ఎంపీ కాన్వాయ్‌పై దాడి ఆరోపణలు.. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే నివాసంపై దాడి, వాహనాల దహనం.. వెరసి సీమ రాజకీయాల్లో పాత ఫ్యాక్షన్ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న ఘర్షణలా? లేక స్థానిక ఎన్నికల గెలుపు కోసం సాగుతున్న ఆధిపత్య పోరా? దాడులు చేసిందెవరు? పెట్రోల్ బాంబులు ప్రయోగించిందెవరు? ప్రత్యర్థులను రెచ్చగొట్టిందెవరు? పోలీసులు ముందే పసిగట్టలేకపోయారా? సమస్యాత్మక గ్రామాల చరిత్ర తెలిసినా హింసను ఎందుకు అడ్డుకోలేకపోయారు? అధికార పార్టీ బాధ్యత ఎంత? ప్రతిపక్షం పాత్ర ఎంత? రాజకీయ నాయకుల అండదండలతోనే నేరస్థులు రెచ్చిపోతున్నారా? నేరం చేసినవారిని శిక్షించకుండా పరస్పర ఆరోపణలతో కాలం గడిపితే సామాన్యుడికి రక్షణ ఎక్కడ? ఆయుధాలు మారుతున్నాయి.. దాడుల పద్ధతులు మారుతున్నాయి.. కానీ ఫ్యాక్షన్ మనస్తత్వం మాత్రం మారడం లేదా? సీమకు కావాల్సింది రాజకీయ ఆధిపత్యమా? అభివృద్ధా? సమాజం ముందు నిలిచిన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటి?

 

#Rayalaseema #FactionPolitics #PoliticalViolence #PetrolBombAllegations #Pulivendula #Tadipatri #AndhraPradesh #LocalElections #ElectionViolence #LawAndOrder