Home AP నేతన్నలకు భారీ ఊరట పెన్షన్‌ నిబంధన సడలింపు

నేతన్నలకు భారీ ఊరట పెన్షన్‌ నిబంధన సడలింపు

50 ఏళ్ల నిండినవాళ్లకు పింఛన్లు.

నూతన నేతన్న భరోసా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. పెన్షన్‌ దరఖాస్తుకు బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌ తప్పనిసరి కాదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. మాస్టర్‌ వీవర్‌ నుంచి వేతనాలు పొందుతున్న చేనేతలు మాస్టర్‌ వీవర్‌ ధ్రువీకరణ పత్రం, వేతన వివరాలు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. ఈ నిబంధన కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో బ్యాంకు స్టేట్‌మెంట్‌ నిబంధనను సడలించాలని సీఎం ఆదేశించారు. 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలందరికీ నేతన్న భరోసా పెన్షన్లు అందిస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు లేకున్నా దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా చేనేత, జౌళి శాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికిపైగా నేతన్నలకు నెలకు రూ.4 వేల పెన్షన్‌ అందిస్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్‌తో పాటు నేతన్నల సేవలో పథకం కింద ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

 

#NethannaBharosa #NethannaBharosaPension #WeaverPension #APWeavers #HandloomWorkers #AndhraPradesh #APSchemes #WeaverWelfare #MinisterSavita #ChandrababuNaidu #HandloomPension #NethannaSevalo #WeaversWelfare #APGovernment #WeaverNews