ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్.. సెకండ్ ఆఫ్ దారుణం.
గులాబీ పార్టీపై జనంలో అభిమానం తగ్గలేదన్న కేటీఆర్ .
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఫస్ట్ ఆఫ్ డిజాస్టర్.. సెకండ్ ఆఫ్ ఇంకా పెద్ద డిజాస్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని విమర్శించారు. కరెంట్, నీళ్లు, ఉద్యోగాలు, శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 30 శాతం కమిషన్లతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశారని విమర్శించారు.
కేసీఆర్ పాటలపై రాజకీయ రగడ
శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు డీజేలు ఆపే పనిలో పడ్డారని కేటీఆర్ విమర్శించారు. నిమజ్జనాల్లో కేసీఆర్ పాటలు పెడితే డీజేలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనసుల్లో కేసీఆర్ స్థానం ఇంకా అలాగే ఉందని అన్నారు. స్వేచ్ఛ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసే నాయకుడిగా కేసీఆర్‌ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ కనిపించిన కొద్దిసేపే ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ సందేహాలు
రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రస్తుత సమస్యలను పరిష్కరించకుండా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేవారు పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. రాయదుర్గం–శంషాబాద్ మెట్రో ప్రాజెక్టు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యేదని అన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా 32 ఎస్టీపీల పనులు పూర్తిచేయాల్సి ఉందని పేర్కొన్నారు. రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
#KTR #BRS #KCR #RevanthReddy #TelanganaPolitics #CongressGovernment #BRSNews #KTRNews #Telangana #PowerCrisis #WaterCrisis #FutureCity #Hyderabad #MusiRejuvenation #PoliticalNews











