Home Inter National News రష్యా చమురు కొనుగోలు అమెరికా ఆంక్షలపై భారత్‌ ఫోకస్

రష్యా చమురు కొనుగోలు అమెరికా ఆంక్షలపై భారత్‌ ఫోకస్

యూఎస్ ప్రతినిధులతో విక్రమ్‌ మిశ్రీ భేటీ.

రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అమెరికా కొత్తగా తీసుకొచ్చిన సాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ యాక్ట్‌ (ఎస్ఆర్ఐఏ) నేపథ్యంలో భారత్‌-అమెరికా మధ్య కీలక చర్చలు జరిగాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిశ్రీ ఆదివారం అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ బ్రయన్‌ మాస్ట్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ద్వైపాక్షిక కాంగ్రెస్‌ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఇటీవల అమల్లోకి వచ్చిన ఎస్ఆర్ఐఏ చట్టంతోపాటు భారత్‌-అమెరికా సంబంధాల భవిష్యత్‌ దిశపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

రష్యా చమురుపై ఆంక్షలే కీలక అంశం

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం అమెరికా కొత్త చట్టంలో ఉంది. అయితే భారత్‌పై 100 శాతం సుంకం ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదు. నిర్దిష్ట పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడికి అలాంటి చర్యలు తీసుకునే అధికారాన్ని చట్టం కల్పిస్తుంది. భారత్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది.

ఎనర్జీ సెక్యూరిటీపై విస్తృత చర్చ

సమావేశంలో ఇంధన భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్ర స్వేచ్ఛ వంటి అంశాలపైనా ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. మిశ్రీ ఇప్పటికే అమెరికా అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అల్లిసన్‌ హూకర్‌తోనూ ఎస్ఆర్ఐఏ, ఇంధన భద్రతపై చర్చించారు. విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశంలో ఆంక్షలపై భారత్‌ ఆందోళనలను ప్రస్తావించారు. అమెరికా ప్రతినిధి బృందంలో ఎస్ఆర్ఐఏకు మద్దతుగా ఓటేసిన సభ్యులతోపాటు వ్యతిరేకంగా ఓటేసిన శ్రీ థానేదార్‌ కూడా ఉన్నారు. బిల్లు సహ-ప్రతిపాదకుడు జిమ్మీ ప్యాట్రోనిస్‌తోపాటు జేమ్స్‌ గల్లఘర్‌, హేలీ స్టీవెన్స్‌ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. థానేదార్‌ మాత్రం అధ్యక్షుడికి అధిక అధికారాలు కల్పించే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యతిరేకించారు.

 

#VikramMisri #IndiaUS #RussianOil #RussiaSanctions #SRIA #SanctioningRussiaAndIranAct #BrianMast #IndiaUSRelations #EnergySecurity #USSanctions #RussianOilImports #Jaishankar #MarcoRubio #IndiaForeignPolicy #USIndiaTalks